Satish B. SettyArchiveAboutRSS Feed

బాహుబలి చిత్రంలో శివ తాండవ స్తోత్రం

Śiva Tāṇḍava stotram composed by Rāvaṇāsura, the king of Rākṣasas.

కీరవాణిగారి సంగీతం అంటె అందులో సంస్కృతం ఉండక తప్పదు. మగధీర చిత్రంలో యం యం యం యక్షరూపం అనే కాళభైరవ స్తోత్రాన్ని సినిమా క్లైమాక్స్‌లో చూపించినట్టె బాహుబలి చిత్రంలో జటాకటాహ సంభ్రమం అనే శివ తాండవ స్తోత్రాన్ని పరిచయం చేశారు. ఈ స్తోత్రంలోనుంచి మూడు చరణాలను పాడారు.

చిత్రం: బాహుబలి
సాహిత్యం: రావణసురుడు, ఇనిగంటి సుందర్
గాయకులు: కీరవాణి, మౌనిమా
సంగీతం: కీరవాణి
నటులు: ప్రభాస్

జటా-కటాహ సంభ్రమ-భ్రమన్-నిలింప-నిర్ఝరీ
విలోలవీచి వల్లరీ విరాజమాన మూర్ధని
ధగద్-ధగద్-ధగద్-జ్వలల్-లలాట-పట్ట-పావకే
కిశోర-చంద్ర-శేఖరే రతిః ప్రతిక్షణం మమ

ఎవ్వడంటా ఎవ్వడంటా నిన్ను ఎత్తుకుంది
ఏ తల్లికి పుట్టాడో ఈ నందికాని నంది
ఎవ్వరూ కనందీ ఎక్కడా వినందీ
శివుని ఆన అయిందేమో గంగదరికి లింగమే కదిలొస్తానందీ

ధరాధరేంద్ర నందినీ విలాస-బంధు-బంధుర-
స్ఫురద్దిగంత-సంతతి-ప్రమోదమాన-మానసే
కృపాకటాక్ష-ధోరణీ-నిరుద్ధ-దుర్ధరాపది
క్వచిద్-దిగంబరే మనో వినోదమేతు వస్తుని

జటాభుజంగ పింగళ స్ఫురత్-ప్రణామణి-ప్రభా
కదంబ-కుంకుమ-ద్రవ-ప్రలిప్త-దిగ్-వధూ-ముఖే
మదాంధ సింధుర-స్ఫురత్వగుత్తరీయమేదురే
మనొ-వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి

ఎవ్వడంటా ఎవ్వడంటా నిన్ను ఎత్తుకుంది
ఏ తల్లికి పుట్టాడో ఈ నందికాని నంది
ఎవ్వరూ కనందీ ఎక్కడా వినందీ
శివుని ఆన అయిందేమో గంగదరికి లింగమే కదిలొస్తానందీ